భారత్ న్యూస్ హైదరాబాద్ …దారుణం: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం – నిందితుడు అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల ముబషీర్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను గమనించి నిందితుడిని అడ్డుకున్నాడు. దీంతో అక్కడ గొడవ జరగగా, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

⚠️ చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి