భారత్ న్యూస్ హైదరాబాద్ …బెల్లంపల్లి: అడవి పందుల మాంసం స్వాధీనం
బెల్లంపల్లి కన్నాల బస్తి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద అడవి పందిని వేటాడి చంపిన కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్ తెలిపారు.
కన్నాలబస్తీకి చెందిన శ్రీరాముల సమ్మయ్య అనే వ్యక్తి అడవి పంది మాంసంతో పట్టుబడగా, అతన్ని విచారించగా శ్రీరాముల రమేష్, చిలుకూరి వెంకట్, సుల్తాన్ నవీన్, పల్లంకొండ రామ్ కలిసి వేటాడి చంపినట్టు ఎఫ్ఆర్ఓ వెల్లడించారు.
