బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

భారత్ న్యూస్ వరంగల్…బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

తెలంగాణ :

ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు గొడవపడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధిర-ఖమ్మం వెళ్తున్న బస్సు వైరా(M) పాలడుగు గ్రామ సమీపంలో రాగానే ఒక కుటుంబం ఎక్కింది.

ఆ కుటుంబానికి చెందిన ఓ మహిళ సీటు కోసం తోటి మహిళలతో వాగ్వాదానికి దిగింది. ఈ వాగ్వాదం తీవ్రమై, ఒకరినొకరు తోసుకుంటూ, జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు.

ఉచిత ప్రయాణంతో మహిళా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి.