భారత్ న్యూస్ వరంగల్…పోస్ట్ ఆఫీస్ అధికారి మోసం!
పోస్టల్ అకౌంట్ లో నుండి 2లక్షల మాయం
మహబూబాబాద్: కొత్తగూడ మండల పోస్ట్ ఆఫీసులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అభాగ్యురాలికి దాతలు అందించిన ఆర్థిక సాయాన్ని పోస్ట్ మాస్టర్ కాజేసి, మానవత్వాన్ని మంటగలిపారు.

కొత్తగూడకు చెందిన సందీప్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన భార్య రచన తన పసిబిడ్డతో ఒంటరిగా జీవిస్తోంది. ఆ కుటుంబం పరిస్థితిని చూసి చలించిన దాతలు, రచన కోసం సుమారు రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆమె(రచన)కొత్తగూడ పోస్ట్ ఆఫీసులో భద్రపరుచుకుంది.
అప్పటి బ్రాంచ్ మేనేజర్ రమేష్, రచనకు తెలియకుండానే ఆ సొమ్మును 27-12-2025 లో డ్రా చేసి కాజేశాడు. ఆ తర్వాత బదిలీపై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
బయటపడిన నిజం.. రాజీకి ప్రయత్నాలు!
ఇటీవల తన ఖాతాలో నగదు లేదని గ్రహించిన బాధితురాలు రచన ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన పసిబిడ్డ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు మాయం కావడంతో ఆమె కన్నీరుమున్నీరవుతోంది. విషయం బయటకు పొక్కడంతో, నిందితుడు రమేష్ తన బంధువుల ద్వారా బాధితురాలికి ఫోన్లు చేయిస్తూ.. రాజీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
స్థానికుల ఆగ్రహం
ఈ దారుణంపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ వంటి బాధ్యతాయుతమైన శాఖలో పని చేసే అధికారి, ఒక నిరుపేద మహిళ నోటికాడ కూడును లాక్కోవడంపై మండిపడుతున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్ని స్కామ్ లు చేసి ఉంటారని.. ఆ.. దొంగ అధికారి రమేష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.