భారత్ న్యూస్ శ్రీకాకుళం….విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…చిల్లర రూపంలో కాదు.. 30 శాతం మేర ఛార్జీలను తగ్గించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.
విద్యుత్ శాఖ పై ప్రగతి నివేదిక అర్ధసత్యం.
ప్రోగ్రెస్ రిపోర్ట్ అంత అసత్యాలు.. అబద్ధాలు.
ప్రగతి కాదు గతి తప్పిన నివేదిక.
ట్రూ అప్ పేరుతో ఛార్జీల మోత మోగించారు.
సామాన్యులకు కరెంటు షాకులు పెట్టారు.
బిల్లులతో ఇల్లులు గుళ్ల చేశారు.
జనాల జేబులకు చిల్లులు పెట్టి, ఒక్క రూపాయి కూడా పెంచలేదని,
పైగా తగ్గించామని చిలక పలుకులు పలకడానికి ముఖ్యమంత్రి అండ్ కో కి సిగ్గుండాలి.
రెండేళ్లలో రెండు సార్లు మోపిన 15,654 కోట్ల భారాన్ని తగ్గించడం అంటారా ?
సర్దుపోటు కింద జనాలకు గుండెపోటు తెప్పించడం గాడిలో పెట్టడం అంటారా?
ఒక చేత్తో మొత్తం దోచి, మరో చేత్తో ఎంగిలి మెతుకులు విదిలించినట్లు..
ముష్టి 13 పైసలు తగ్గించి విద్యుత్ శాఖను ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం చంద్రబాబు గారికే సాధ్యం.
విద్యుత్తు చార్జీలపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే,
అమలవుతున్న ట్రూ అప్ భారం 15 వేల కోట్లను తక్షణం రద్దు చేయండి.

ట్రూ అప్ పేరుతో రెండేళ్లలో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి వినియోగ దారులకు బిల్లులలో మాఫీ చేయండి.