ఆపరేషన్‌ సిందూర్‌లో అమర వీరులు వీరే.ఏడాది తర్వాత వెల్లడించిన ప్రభుత్వం

భారత్ న్యూస్ విజయవాడ…ఆపరేషన్‌ సిందూర్‌లో అమర వీరులు వీరే.ఏడాది తర్వాత వెల్లడించిన ప్రభుత్వం

🔹పాకిస్థాన్‌ చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిరుడు నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్రం తొలిసారిగా శుక్రవారం వెల్లడించింది. ఇందులో ఐదుగురు భారత సైన్యం, ఒకరు వైమానిక దళానికి చెందిన వారు. వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారక వెబ్‌సైట్‌లో గౌరవ పట్టికలో ప్రచురించారు. న్యూఢిల్లీలోని యుద్ధ స్మారక చిహ్నం 3డీ గోడపై కూడా పొందుపరిచారు.

🔹ఆర్మీకి చెందిన సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌, రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌, వైమానిక సాంకేతిక నిపుణుడు మూడ్‌ మురళీనాయక్‌, హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌, వైమానిక దళానికి చెందిన సార్జంట్‌ సురేంద్ర కుమార్‌ ఉన్నారు.