భారత్ న్యూస్ అనంతపురం..రాయలసీమలో చరిత్ర పునరావృతం!
కనకసీమ నుండి మొట్టమొదటి జొన్నగిరి బంగారు బిస్కట్లు మార్కెట్లో విక్రయించారు. ఒకప్పుడు ఇదే రాయలసీమలో రతనాలను రాశులుగా పోసి అమ్మారు. నేడు హార్టికల్చర్ హబ్‌గా ప్రపంచానికి పండ్లు, కార్లు, మొబైళ్లు, బంగారాన్ని అమ్ముతోంది. స్టెల్త్ ఫైటర్ విమానాలతో దేశ రక్షణకూ తోడ్పడుతోంది. బడుల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా పెట్టాలో రాష్ట్రానికే పాఠాలు చెబుతోంది. ఒకప్పటి ఈ కరువు సీమ, నేడు భూగర్భ జలాలు ఎలా పెంచవచ్చో చేసి చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి బిస్కట్ మీదా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రేంజ్ లో రాయల్టీని చాటుకుంటోంది! రాష్ట్రానికి బంగారు బాతు అయ్యింది.
