ఎన్నో నీతులు చెబుతూ నెంబర్ వన్ టీవీ9 ఛానల్ రజనీకాంత్ ఇన్కమ్ టాక్స్కట్టకుండా ఎగ్గొట్టి నోటీసులు వరకు

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఎన్నో నీతులు చెబుతూ నెంబర్ వన్ టీవీ9 ఛానల్ రజనీకాంత్ ఇన్కమ్ టాక్స్
కట్టకుండా ఎగ్గొట్టి నోటీసులు వరకు
తెచ్చుకున్న దుస్థితి…
ఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి
ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది..

కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్

ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు
స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన
నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు
ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలీని
వ్యక్తులు..

వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి..

ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది..

మరోవైపు ఇటీవలే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్
లో 11 కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత
ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో 8 కోట్లతో
కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న
త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైనా
ఆరా తీస్తున్నారు ఇన్ కమ్
ట్యాక్స్ అధికారులు..

వీటితో పాటు బెంగళూరులో
రజినీకాంత్ కు సంబంధించిన ప్రీమియర్
రియల్ ఎస్టేట్ కంపెనీ పైనా ఇటీవలే
ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయి..

నెల్లూరు చెందిన కిషోర్ అనే వ్యక్తితో కలిసి
గత ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ ఇన్ ఫ్రా
కంపెనీని నడుపుతున్న రజినీకాంత్..

అటు అమరావతిలో చంద్రబాబు మళ్లీ
సీఎం కావడంతో రజినీకాంత్ భూముల
రేట్లు అమాంతం పెరిగాయి..

గతంలో అమరావతిలోని
కృష్ణాయపాలెంలో కొనుగోలు చేసిన 18 ఎకరాల భూమికి సంబంధించి సీఆర్డీయే నుంచి తిరిగి రావాల్సిన ఫ్లాట్లకు ఇటీవలే దరఖాస్తు చేసుకున్నాడు..సీఆర్డీయే నుంచి సమాచారం ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు
చేరినట్టుగా తెలుస్తోంది..

హైదరాబాద్ రోడ్ నంబర్ 36లో
నడుస్తున్న పబ్బులోనూ రజినీకాంత్ కు
వాటా ఉంది. జగన్ ప్రభుత్వం దిగిపోయేముందు ఏపీ మంత్రితో కలిసి వైజాగ్ లో మరో పబ్బు స్టార్ట్ చేశాడు..

అటు వైసీపీ ప్రభుత్వం నుంచి అందిన
కోట్లాదిరూపాయలను క్యాష్ రూపంలోనే
తీసుకుని ఆ డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్
వ్యాపారంలో పెట్టాడు రజినీకాంత్..

మరోవైపు వైసీపీ డిజిటల్ మీడియా
ఇన్ చార్జ్ సజ్జలభార్గవ్ రెడ్డితో కలిసి
భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉన్న అన్ని డిజిటల్ ప్లాట్
ఫాంలను వైసీపీకి అనుకూలంగా
పని చేసేలా కాంటాక్ట్ కుదుర్చింది రజినీకాంత్.

అయితే ఆ డిజిటల్ ఛానెల్స్,
పత్రికలన్నింటికీ పేమెంట్ ఇంకా
పెండింగ్ ఉంది. పార్టీ ఓడిపోయింది
కాబట్టి పెండింగ్ ఎమౌంట్ ఏదీ
ఇప్పించలేనంటూ చేతులెత్తేశాడు
రజినీకాంత్..

అటు సజ్జల భార్గవ్ రెడ్డి
అటు ఐప్యాక్ సిబ్బందికి,
సోషల్ మీడియా సిబ్బందికి
ఇవ్వాల్సిన పేమెంట్ మొత్తం
ఆపేశాడు రజినీకాంత్,
సజ్జల భార్గవ్ రెడ్డి కలిసి
తమకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ
కాజేశారని డిజిటల్ ఛానెల్స్ వాళ్లు
ఆరోపిస్తున్నారు.

మరోవైపు అటు తెలంగాణ ఎన్నికల్లో
ఇటు ఏపీ ఎన్నికల్లో పొలిటికల్ లీడర్ల
ఇంటర్వ్యూల పేరుతో భారీ మొత్తంలో
వసూలు చేశాడు రజినీకాంత్.
ఒక్కో లీడర్ నుంచి పదిలక్షల నుంచి
పాతిక లక్షల వరకూ మొత్తం మీద రెండు
రాష్ట్రాల్లో కోట్లాదిరూపాయలు
వసూలు చేశాడు. వాస్తవానికి ఛానెల్ మార్కెటింగ్ టీమ్ తరఫున రావాల్సిన యాడ్ రెవెన్యూ అంతా ఇలా తానే లీడర్లతో డైరెక్టుగా
మాట్లాడి మొత్తం నొక్కేశాడు.

తన బినామీ అయిన ధర్మారెడ్డి
అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగాయి.
ధర్మా రెడ్డి, రజినీకాంత్ ఇద్దరూ కలిసి
కాజేసిన మొత్తం మీద అటు మైహోమ్
యాజమాన్యం కూడా విచారణ జరుపుతోంది.

మొత్తం మీద ఒక్క వైసీపీ పార్టీ
అధికారం కోల్పోవడంతో రజినీకాంత్ కు
కష్టాలు చుట్టముట్టాయి.