మండే ఎండలకు పశువులు,పక్షులు విలవిల!

భారత్ న్యూస్ వరంగల్ …మండే ఎండలకు పశువులు,పక్షులు విలవిల!

కరీంనగర్ జిల్లా:మే 23
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం తో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి, అవుతున్నారు భానుడి భగభగలకు కొన్ని ప్రాంతాలలో వడదెబ్బలు తగిలి జనాలు మరణిస్తున్నారు. కేవలం మనుషులే కాకుండా పశువులు, పక్షులు కూడా ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తుంది, శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో మండే ఎండలకు ఓ రైతుకు సంబంధించిన ఎద్దు మరణించింది..

అలాగే కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పరిధిలోని బోర్న పల్లి శివారులో శుక్ర వారం మధ్యాహ్నం ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుకలు రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి….