ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై చిలకలపూడి పోలీసుల ఆకస్మిక దాడి

భారత్ న్యూస్ గుంటూరు…ఐపీఎల్ ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాపై చిలకలపూడి పోలీసుల ఆకస్మిక దాడి

రూ.36 వేల నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం – నలుగురు అరెస్ట్

:

కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ పోలీసులు వరుస చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ V. విద్యాసాగర్ నాయుడు ఐ‌పి‌ఎస్ గారి ఆదేశాల మేరకు, ఎస్‌డీపీఓ బందరు శ్రీ సి‌హెచ్ శ్రీనివాస రావు గారి అనుమతితో, చిలకలపూడి సీఐ షేక్ అబ్దుల్ నబీ గారి పర్యవేక్షణలో చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ U. చంటి గారుమరియు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు నిన్న అనగా ది 22-05-2026 రాత్రి 9 గంటల సమయంలో మచిలీపట్నం ఈడేపల్లి ప్రాంతంలోని డోర్ నంబర్ 145, ఎస్ కన్వెన్షన్ ఎదుట ఉన్న జంగాల జువెలర్స్ పాత ఇంటిలో ఐపీఎల్ మ్యాచ్‌లపై మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో క్రింది నిందితులతో పాటు మరో 25 మందితో కలిసి సామూహికంగా ఆన్‌లైన్ జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

  1. చలమలశెట్టి రవీంద్రబాబు, తండ్రి పేరు సత్యనారాయణ, వయస్సు 48 సంవత్సరాలు, కాపు, కొబ్బరితోట, మచిలీపట్నం.
  2. పామర్తి ధరణికుమార్, తండ్రి పేరు వెంకటేశ్వరరావు, వయస్సు 42 సంవత్సరాలు, గౌడ, గొడుగుపేట, మచిలీపట్నం.
  3. పిన్నింటి రవికుమార్, తండ్రి పేరు సూర్యనారాయణ, వయస్సు 50 సంవత్సరాలు, తూర్పు కాపు, బాలరామునిపేట, మచిలీపట్నం.
  4. ఇజ్జాడ సత్యం, తండ్రి పేరు వరహాల నాయుడు, వయస్సు 58 సంవత్సరాలు, తూర్పు కాపు, బాలరామునిపేట, మచిలీపట్నం.

సంఘటనా స్థలంలో పై నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.36,865/- నగదు, 8 సెల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలలో AP40EJ3379 అథర్ స్కూటర్, AP39SW8743 సుజుకి యాక్సెస్ మరియు AP07AD4891 హీరో హోండా ప్యాషన్ ప్రో వాహనాలు ఉన్నాయి.

ఈ ఘటనపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్‌ల పేరుతో జరుగుతున్న అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. యువత మరియు ప్రజలు ఇలాంటి అక్రమాలకు దూరంగా ఉండాలని, ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా జూద కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.