భారత్ న్యూస్ హైదరాబాద్…ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు పొడిగింపు
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జూన్ 14, 2027 వరకు పొడిగించింది. పౌరులు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన పత్రాలను ‘myAadhaar’ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, ఈ వెసులుబాటు కేవలం ఆన్లైన్ సేవలకు మాత్రమే వర్తిస్తుందని, ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని UIDAI స్పష్టం చేసింది.
