ఏప్రిల్ నెల రాబడి రూ.12,510 కోట్లు: కాగ్

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏప్రిల్ నెల రాబడి రూ.12,510 కోట్లు: కాగ్

ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో రూ.23,321.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రాబడి రూపంలో రూ.12,510 కోట్లు రాగా అప్పుల రూపంలో రూ.10,901.21 కోట్లు సమీకరిం చారు. బడ్జెట్లో ఏడాది మొత్తానికి అంచనా వేసిన రాబడిలో 5% తొలి నెలలో వచ్చింది. ఖర్చు అంచనాల్లో తొలి నెలలో 7.65% చేశారు. తొలి నెల లోనే రూ.10.277 కోట్ల రెవెన్యూ లోటు ఉండటం గమనార్హం. రెవెన్యూ రాబడి రూ.12,510 కోట్లు కాగా రెవెన్యూ ఖర్చు రూ.22,787.95 కోట్లుగా ఉంది. తొలి నెలలో రాష్ట్ర సొంత రాబడి రూ.12,086 కోట్లుగా ఉంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏమీ అందకపోవడం వల్ల కూడా రెవెన్యూ రాబడి తక్కువుగా ఉంది. ఈ వివరాలు కాగ్ శుక్రవారం రాత్రి వెల్లడించింది.