భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా: ఎవరిచ్చారు నీకు అధికారం.. కమిషనర్ పై MP !
మచిలీపట్నం కొబ్బరితోటలో జనసైనికుడు ఇంటిని కూల్చివేసిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజుపై ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో శనివారం జరిగిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ బాలశౌరి హాజరయ్యారు. ఇంటి కూల్చివేతపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో ఇంటిని కూల్చివేశారని, కూల్చివేయడానికి అధికారాలు ఎవరిచ్చారని ఆయన కమిషనరిని ప్రశ్నించారు.
