భారత్ న్యూస్ హైదరాబాద్…ఆవు మాంసం తినే అమెరికా,అరబ్ దేశస్థుల ప్రేమ… స్వదేశీలపై ద్వేషం ఎందుకు.?
మన దేశంలో అందరూ ఆవు మాసం త్యాగించడానికి సిద్ధం
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి సిద్ధమా
రాష్ట్ర అహలె సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా
ఇబ్రహీంపట్నం,
బక్రీదు సమయంలో కాదు, ఎప్పుడు కూడా ఆవు మాంసం భారతదేశంలో ముస్లింలు తినకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని… పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అహలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా.
అదేవిధంగా ఆవులను సంరక్షించేందుకు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పవిత్రంగా చూసుకునే ఆవులను రోడ్లమీద వదలకుండా… అవి చెత్త కుండీల వద్ద ప్లాస్టిక్ తింటూ అనారోగ్య పాలవటం ఎంతవరకు సబబు అన్నారు.కేవలం భారత దేశం లో ఆవు మాసం తినేవాళ్ళని ద్వేషించి, ప్రపంచవ్యాప్తంగా ఆవు మాసం తినే వాళ్ళ పై ప్రేమ న్యాయం కాదన్నారు.ముస్లింలు బక్రీద్ పండగ ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని అల్తాఫ్ బాబా విజ్ఞప్తి చేశారు.
కొంతమంది ముస్లిం ధనవంతుల చేష్టల వలన మొత్తం సమాజానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.
ముస్లిం ధనవంతులు బక్రీద్ పండగ ఖుర్బానీ మాంసం పేదవాళ్లకు పంచాలి. అందుకోసం పేదలకు,మదర్సాలకు గొప్పల కోసం ఆవు మాసం ఖుర్బానీ ఇస్తున్నారు. ఇళ్లల్లో మాత్రం మేకలు గొర్రెలు ఖుర్బానీ ఇస్తున్నారు.ఆవు మాంసానికి ఏడుగురు పేర్ల మీద ఇస్తారు. ఖర్చు తక్కువగా అవుతుందని ఇలా చేస్తారని,ఎక్కడైనా ముస్లిం ఫంక్షన్స్ లో, పెళ్లిళ్లలోఆవు మాంసం తో ఫంక్షన్ ఎక్కడైనా చూశారా..? అని ప్రశ్నించారు.ఆవు లను పూజించే వారు ఆవు ని జాతీయ జంతువుగా చట్టం తెచ్చేంత వరకు పోరాడాలని అవసరమైతే మీరు చేసే పోరాటానికి పూర్తిగా మా మద్దతు ఉంటుందని అల్తాఫ్ బాబా తెలిపారు.
