భారత్ న్యూస్ రాజమండ్రి…మత సంస్థలు ఆర్టీఐ పరిధిలోకే: సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేసే దేవాలయాలు, వక్ఫ్ సంస్థలు, మసీదులు, చర్చిలు ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ప్రజల విరాళాలు, హుండీ ఆదాయం, ఆస్తుల నిర్వహణపై సమాచారం కోరే హక్కు ప్రజలకు ఉందన్నారు. అయితే వ్యక్తిగత మత విశ్వాసాలు ఆర్టీఐ పరిధిలోకి రావని తెలిపారు. విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం కోరిన సమాచారాన్ని 15 రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు.
