భారత్ న్యూస్ ఢిల్లీ…..కోర్టుల్లో సమన్లు, వారెంట్లు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో జారీకి నిబంధనలు ఖరారు
దేశంలో 2024 జులైలో అమల్లోకి వచ్చిన మూడు
నూతన చట్టాలకు అనుగుణంగా న్యాయస్థానాల విచారణ ప్రక్రియలో సాంకే తికతను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ ఎలక్ట్రానిక్ ప్రాసెస్సెస్ (ఇష్యుయెన్స్, సర్వీస్, ఎగ్జిక్యూషన్) రూల్స్-2025ని నోటిఫై చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం దీనిపై జీవో జారీ చేశారు. తద్వారా సమన్లు, వారంట్లు, వాటి అమలుకు సాంకేతికతను వినియోగించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆదేశాలు జారీచేయొచ్చు. కోర్టు ద్వారా సమన్లు అందజేయడం సాధ్యంకాని పక్షంలో.. పోలీసులు, సిబ్బందితో సదరు వ్యక్తి అధికారిక మెయిల్ కు, ఇతర విధానాల ద్వారా డిజిటల్ సమన్లు పంపొచ్చు. కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టం (సీఐఎస్) సాఫ్ట్వేర్ ద్వారా జిల్లా జ్యుడి షియరీ, హైకోర్టు సంబంధిత కేసుల డేటా కలెక్షన్ చేయొచ్చు.
