Jahnavi Kapoor will play the role of Srikanth’s daughter in Deora

భారత్ న్యూస్ సినిమా,,,,,ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతోన్న దేవర మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రాబోతోన్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ అంతా ముగిసినట్టుగానే తెలుస్తోంది. వెకేషన్ నుంచి ఎన్టీఆర్ తిరిగి వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ పూర్తి చేయబోతోన్నారు.ఓ భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ వినడానికి ఆసక్తికరంగానే ఉంటాయి. అప్డేట్లు ఇవ్వాలంటూ అభిమానులు సైతం ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, యంగ్ టైగర‌గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత రాబోతోన్న చిత్రం కావడంతో సహజంగానే అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఇక కొరటాల శివ ఆచార్య ఫ్లాపుతో ఉన్నా సరే ఎన్టీఆర్ నమ్మి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. దేవరగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.