Headlines

Mahesh Babu is back from the family foreign tour

భారత్ న్యూస్ సినిమా,,,,మహేష్ బాబు ఫ్యామిలీ ప్రస్తుతం దుబాయ్ నుంచి హైద్రాబాద్‌కు తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. మామూలుగా న్యూ ఇయర్ వెకేషన్‌కు వెళ్లిన ఈ ఫ్యామిలీ.. నేడు గుంటూరు కారం ఈవెంట్ ఉంటుందని తిరిగి వచ్చేశారు. కానీ ఆ ఈవెంట్‌కు పోలీసుల నుంచి పర్మిషన్ రాలేదు.మహేష్ బాబు ఫ్యామిలీ న్యూ ఇయర్ వెకేషన్‌ను పూర్తి చేసుకుని వచ్చింది. న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. మూములుగా ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ రోజు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండాలి. అందుకే మహేష్ బాబు ఈ రోజే హైద్రాబాద్‌కు వచ్చారు. కానీ ఇక్కడేమో గుంటూరు కారం ఈవెంట్‌కు అనుమతులు రాలేదు.ఇదిలా పక్కన పెడితే.. మహేష్ బాబు, నమ్రత, సితార, గౌతమ్ మాత్రం వెకేషన్‌లో హంగామా చేశారు. ఇక సితార, గౌతమ్‌లు ఎంతలా సందడి చేశారో నమ్రత ఇన్ స్టా పోస్టులు చూస్తే తెలుస్తుంది. సితార సైతం ఎప్పటికప్పుడు అన్నట్టుగా అప్డేట్లు పెడుతూనే వచ్చింది. తాజాగా గౌతమ్ వీడియో ఒకటి నెట్టింట్లో షేర్ అవుతూ వచ్చింది. ఎయిర్ పోర్టులో గౌతమ్ జంప్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.