శ్రీ పులివర్తి నాని,శ్రీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు గార్ల తరపున ఇంటింటికి స్త్రీ శక్తి ,టీడీపీ అధికారంలోకి,,

పాకాల పట్టణ పరిధిలో ఉత్సాహంగా టిడిపి ప్రచార కార్యక్రమం

పాకాల( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం,పాకాల పట్టణ పరిధిలోని బూత్ నంబర్ 98,99 శివాజీ నగర్(యస్టీ),బాలాజీ కాలనీ(యస్సీ),గాంధీనగర్(బీసీ)నందు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే,యంపీ అభ్యర్థులు శ్రీ పులివర్తి నాని,శ్రీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు గార్ల తరపున ఇంటింటికి స్త్రీ శక్తి ,టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తుందని టీడీపీ నాయకులు తెలిపారు.”ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టబోయే పథకాలపై వివరించారు. ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 నగదు ఇస్తారన్నారు. రైతుకు రూ.20వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు తదితర పథకాలను అమలు చేస్తుందన్నారు. రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. ప్రతి ఇంటికి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు