Headlines

-గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి

భారత్ న్యూస్:”
రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివి

-గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి

-పెత్తందారులకు మీ ఓటుతో గట్టిగా బుద్ది చెప్పండి

భారత్ న్యూస్ కూడేరు ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి

కూడేరు ఏప్రిల్ 13:
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఇది ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాష్ట్రంలోని పేదలు, అక్కా, చెల్లెమ్మలు, అవ్వ, తాతలు, విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలని వైస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు,చిత్తూరు జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వర్థ్ నాయక్ అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలని వారు పిలుపునిచ్చారు. కూడేరు మండల కేంద్రంలో శనివారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో చిత్తూరు జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వర్థ్ నాయక్ పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు, గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యం తో వారికి అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. మహిళలు హారతులు పట్టారు. యువకులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారు రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా బస్టాండ్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనంతా మోసం, అబద్ధాలు, కుట్రలే తప్ప ఏమీ లేవన్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని, సీనియర్ అని చెప్పుకుంటున్న ఆయన ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అనేక హామిలిచ్చి గెలిచాక ఏ ఒక్క హామీనైనా నెరవేర్చలేదని విమర్శించారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలను గాలికొదిలేసిన పయ్యావుల కేశవ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. ఆయనకు ప్రజలు అవసరం లేదని కేవలం పదవి మాత్రమే కావాలని చెప్పారు. మే 13 న జరిగే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు జరిగే ఎన్నికలని మీ ఓటు తో పయ్యావుల కేశవ్ లాంటి పెత్తందారులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.