భారత్ న్యూస్ హైదరాబాద్…ఎంబీబీఎస్ చదువుతున్న గౌరీకి రామన్న భరోసా….
కొల్లాపూర్ నియోజకవర్గం, వీపనగండ్ల మండలం, కల్వరాల గ్రామానికి చెందిన బొరెల్లి నర్సింహా కుమార్తె బొరెల్లి గౌరి పటాన్చెరు మహేశ్వరం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
అయితే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఫీజులు చెల్లించడం, అమ్మాయిని చదివించడం కష్టసాధ్యంగా ఉన్నది.
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్టోబర్ 2024లో మొదటి సంవత్సరం ఫీజును చెల్లించారు.
నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్లో రెండో సంవత్సరానికి సంబంధించిన రూ.1.30 లక్షల ఫీజు చెక్కును విద్యార్థినికి కేటీఆర్ గారు అందజేశారు.

గౌరి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ కుమార్తె చదువు కొనసాగేందుకు అండగా నిలిచిన కేటీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు….