మంచిర్యాల: గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం

భారత్ న్యూస్ వరంగల్ …మంచిర్యాల: గంజాయి నిర్మూలనలో ప్రజల సహకారం అవసరం….

మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్ సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న యువకులతో డీసీపీ మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. వ్యసనపరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు…