“ఏ విధంగా ఐతే యూదులు ఇజ్రాయెల్‌ను సృష్టించాలని సంకల్పించి నిర్మించారో,

Bharathnews.hyd,,

“ఏ విధంగా ఐతే యూదులు ఇజ్రాయెల్‌ను సృష్టించాలని సంకల్పించి నిర్మించారో, అలాగే హిందువులు కూడా సంకల్పిస్తే రామరాజ్యం నిర్మితమవుతుంది.” – శ్రీ విజయ్ శర్మ, ఉప ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్

200 పైగా ఉన్న హిందవులతో ఏర్పడ్డ “హిందూ రాష్ట్ర సమన్వయ సమితి” ఏకగ్రీవ తీర్మానం !

రాయ్‌పుర్ (ఛత్తీస్గఢ్) – “రాయ్‌పుర్‌లోని పూజ్య షాదాణీ దర్బార్లో ఏర్పాటు చేసిన ‘ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర స్థాయి హిందూ రాష్ట్ర సదస్సు’లో ప్రసంగిస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ. విజయ్ శర్మ, ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ఇజ్రాయెల్‌ను నిర్మించాలనే తీర్మానంతో ఇజ్రాయెల్‌ను నిర్మించారు అనే విషయాన్ని హిందువులు మరచిపోరు. ఈరోజు శ్రీరామ మందిరం నిజమైంది. తదుపరి తీర్మానం కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. దీని కోసం మనం నిరంతరం పోరాడవలసి ఉంటుంది. ఈ భూమి ఛత్రపతి శివాజీ మహారాజ యొక్క హైందవీ స్వరాజ్యాన్ని చూసింది మరియు రాబోయే కాలంలో నిర్మితమయ్యే రామరాజ్యాన్ని కూడా చూస్తుంది.’ అని అన్నారు.

పూజ్య షాదాణీ దర్బార్ తీర్థం, శ్రీ నీలకంఠ సేవా సంస్థాన్, మిషన్ సనాతన మరియు హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. పూజ్య యుధిష్టిర్‌లాల్ మహారాజ్, పూజ్య రాంబాల్కదాస్ మహాత్యాగి, నీలకంఠ త్రిపాఠి మహారాజ్ పండితుడు, సనాతన సంస్థ పం‍డితుడు అశోక్ పత్రికర్త్ తో దీప ప్రజ్వలన చేసి హిందూ మహాసభను ప్రారంభించారు. ప్రారంభంలో సనాతన సంస్థ వ్యవస్థాపకులు, సచ్చిదానంద పరబ్రహ్మ (డా) జయంత ఆఠవలె గారి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సదస్సులో ‘695’ సినిమా నిర్మాత శ్రీ. షామ్ చావ్లా, సీనియర్ బిజెపి నాయకుడు సచ్చిదానంద్ ఉపాసని, సిఎ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీ. అమితాబ్ దూబే, రాయ్‌పూర్ శివసేననుంచి శ్రీ ఆశిష్ పరెడ, రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు, కార్మికులు, ఆచార్యులు, మహంతులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు తదితరులు 250 మందికి పైగా హిందువులు పాల్గొన్నారు.

మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల యొక్క హిందూ జనజాగృతి సమన్వయ సమితి ఐన శ్రీ సునీల్ ఘాన్వాట్ కార్యక్రమంలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, మిషనరీలు, నక్సలైట్లు, జిహాదీలు, సెక్యులరిస్టులు మరియు ఖలిస్తానీల దుష్ట కలయిక హిందూ ధర్మం నాశనం చేయడానికి కృషి చేస్తోంది. హిందూ సంస్థలు, సంతులు, హిందూ కార్యకర్తలు మరియు న్యాయవాదుల కూటమిగా హిందూ దేశాన్ని స్థాపించడానికి సంఘటిత కృషి చేయాలి. ప్రస్తుతం వక్ఫ్ చట్టం హిందువుల భూమిని అక్రమంగా ఆక్రమిస్తోంది. దేవాలయాలను కూడా ఆక్రమిస్తోంది. ఈ తప్పుడు చట్టాన్ని తొలగించేందుకు ప్రతి ఒక్క గ్రామంలోనూ హిందువులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

షాదాణీ దర్బార్‌కు చెందిన గౌరవనీయులైన యుధిష్ఠిర్‌లాల్ మహారాజ్ గారు మాట్లాడుతూ, ‘మన నాగరికత ఎంతో గొప్పది; ప్రాచీనమైనది. ఐనప్పటికీ, మనం ఏకతాటిపైకి రాలేకపోతున్నాము. మన స్వంత దేశంలో ఉంటూ కూడా హిందూ జెండాను ఎగురవేయలేకపోయాము. సచ్చిదానంద పరబ్రహ్మ (డా) జయంత ఆఠవలె గారు మరియు సంతుల నాయకత్వంలో జరిగే ఈ ప్రచారం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. భారతదేశం హిందూ దేశంగా మారుతుంది. హిందూ జన జాగృతి సమితి మరియు పూజ్య షాదాణీ దర్బార్‌ తీర్థ వంటి సంస్థలు సంతులు మరియు దైవి శక్తులకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాయి, దీని నుండి మనకు లభించే శక్తి ఆచారకాండ కంటే గొప్పది.’ అని అన్నారు.

సనాతన సంస్థ యొక్క ధర్మ ప్రచారకులు పూజ్య అశోక్ పత్రికర్ గారు మాట్లాడుతూ, ‘ఈ రోజు నిర్మించిన రామ మందిరం హిందూ దేశ స్థాపనకు పునాది. కానీ హిందూ దేశం ఎవరు మనకి ఇవ్వరు. దీని కోసం మనమే త్యాగాలు చేయవలసి ఉంటుంది. మన ధార్మిక ఆచారాలను అనుసరించడం మరియు ఆధ్యాత్మిక సాధన చేయడంతో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలి, ఈ ఆధ్యాత్మిక బలంతో రామరాజ్యం వంటి ఆదర్శ హిందూ రాష్ట్రం సాకారం అవుతుంది.

ఈ కార్యక్రమంలో వక్ఫ్‌ బోర్డ్‌ చేస్తున్న భూ జిహాద్’ అనే అంశంపై శ్రీ సునీల్‌ ఘన్‌వత్‌, ‘ఆలయాలు నిర్వహణ మరియు ఆలయాలు సనాతన ధర్మ ప్రచార కేంద్రాలుగా ఎలా ఉంటాయి’ అనే అంశంపై సిఎ మదన్‌ మోహన్‌ ఉపాధ్యాయ, ‘రాజ్యాధికారంపై ధర్మాధికారం ఆవశ్యకత’ అనే అంశంపై పూజ్యనీయ రాంబల్కదాస్ మహాత్యాగి మహారాజ్, ‘హిందూ సంస్థల్లో సంతుల పాత్ర మరియు వారి కార్యావళి’ అనే అంశంపై పండిత్ నీలకంఠ్ త్రిపాఠి మహారాజ్, ‘హిందువులలో ఉన్న బుద్ది వివక్షని ఎలా ఎదుర్కోవాలి’ అనే అంశంపై శ్రీ. సంతోష్ తివారీ ‘హిందూ సంస్థలకు మీడియా నిర్వహణ అవసరం’పై శ్రీ. అమిత్ చిమ్నాని మొదలైన కీలక వక్తలు హాజరైన హిందూవులను ఉద్దేశించి ప్రసంగించారు

‘హిందూ ధర్మంపై దాడులకు వ్యతిరేకంగా చేసిన సమ్మేళన ప్రయత్నాలు’ అనే అంశంపై నిర్వహించిన స…