1000 crores should be allocated in the state budget for handicrafts. Elections should be held for cooperative societies.

..Bharathnews.hyd,

చేనేతకు రాష్ట్ర బడ్జెట్ లో 1000కోట్లుకేటాయించాలి. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెంకట్రాములు.
తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుల నిరాదరణతో చేనేత రంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వ్యవసాయం తర్వాత రెండవ ఉపాధి రంగంగా ఉన్న చేనేతపరిశ్రమనురక్షించడంలో కార్మికులనుఆదుకోవడంలోపాలకులువిఫలమైనందుననేచేనేతకళఅంతరించిపోయేప్రమాదంఏర్పడిందన్నారు.కార్మికులుపనులులేకఆర్థికఇబ్బందులతోఆత్మహత్యలకుపాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతప్రభుత్వంచేనేతసహకారసంఘాలపాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా సహకార వ్యవస్థ స్ఫూర్తినే దెబ్బతీసిందన్నారు.రాష్ట్రంలోఅధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టి సారించివెంటనేసహకారసంఘాలకుఎన్నికలునిర్వహించాలని, రానున్న రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు 1000 కోట్ల రూపాయలు కేటాయించి చేనేతల సంక్షేమానికి అభివృద్ధికి చేయూతనందించాలన్నారు. సహకార సంఘాల దగ్గర, మాస్టర్ వీవర్స్ వద్ద పేరుకుపోయిన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయించాలని, సహకార సంఘాలతో పాటు కార్మికుల రుణాలను మాఫీ చేసి కొత్తగారుణాలుఇవ్వాలన్నారు .సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమఎదుర్కొంటున్నసమస్యలను
పరిష్కరించికార్మికులకుపనులుకలిగించిఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని,కేంద్ర బడ్జెట్ లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి చేనేతలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని వెంకట్రాములు డిమాండ్ చేశారు.