ఆర్టీసీ సమ్మె ప్రభావం – మెట్రో సేవలు పెంపు

.భారత్ న్యూస్ హైదరాబాద్….Telangana | ఆర్టీసీ సమ్మె ప్రభావం – మెట్రో సేవలు పెంపు

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.

మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

🚆 కొత్త ఫ్రీక్వెన్సీ వివరాలు:

👉 మియాపూర్ – ఎల్బీనగర్ మార్గంలో ప్రతి 4 నిమిషాలకు ఒక ట్రైన్

👉 నాగోల్ – రాయదుర్గం మార్గంలో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక ట్రైన్

👍 ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.