ప్రభాస్ సినిమాలో ఆక్ట్ చేయటం ఆపేద్దామని అనుకుంటున్నారు. ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతూ ఈ వార్త దానికి కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు

భారత్ న్యూస్ సినిమా,,,,రెబల్ స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన మరి కొద్దిరోజుల్లో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..’సలార్’ హిట్‌ కావడంతో రెబల్ స్టార్ అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్‌కు మళ్లీ అంతటి రేంజ్ హిట్ పడలేదు.సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. ఈ సమయంలోనే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ సినిమా ప్రకటించినప్పటి దగ్గర నుంచి ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచానలకు తగినట్టుగానే ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ‘సలార్’ మూవీ ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.ఇదింతా బాగానే ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ప్రభాస్ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని కారణంగానే ‘సలార్’ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కావాల్సింది, డిసెంబర్‌లో విడుదలైందని అంటున్నారు. ఇక ‘సలార్‌’లో చూపించినంత ఫిట్‌గా ప్రభాస్ బయట లేడనే విషయం అందరికీ స్పష్టం అవుతుంది. ప్రభాస్ ఆరోగ్య కారణంగానే కల్కి సినిమా కూడా ఆలస్యం అవుతుందనే కామెంట్స్ తెర మీదకు వచ్చాయి