శనిబాధలు తొలగించి అన్ని రకముల ధార్మిక ఫలితాలు ఇచ్చే త్రిపుర సుందరి సుందరకాండ

భారత్ న్యూస్ తిరుపతి సుందరకాండ
శనిబాధలు తొలగించి అన్ని రకముల ధార్మిక ఫలితాలు ఇచ్చే త్రిపుర సుందరి సుందరకాండ

అమల కనకవర్ణం ప్రజ్వలత్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదాసుప్రసన్నమ్
పటుతరఘనగాత్రం కుండలాలంకృతాంగం
రణజయకరవాలం రామదూతం నమామి

ఉపాసనాపరంగా ఆంజనేయుడు మంత్రాధిష్ఠాన దేవత

దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త స మే గురు:
నిత్య మనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా

సువర్ఛస్సు అనే విధంగా
సువర్చల మంచి వర్చస్సు అని అది సూర్యకళల్లో ఒక కళ.

పదాలలోనే హనుమంతుని యోగసాధన సూచితమైంది. మైనాక, సురస, సింహికా వృత్తాంతాలు గ్రంథి త్రయ భేదనాలకు నిదర్శనాలు. లంకా నగరమే మూలాధారం. సీతామాతకు వాడిన అనేక పదాలు ఆమె పరాశక్తికి, కుండలినీ శక్తికి ప్రతీక అని స్పష్టంగా చెబుతున్నాయి.

సుందరకాండ పారాయణ పద్ధతులు

మన అభీష్టాన్ని అనుసరించి తగిన కాలాన్ని ఎంపిక చేసుకోవాలి. సుందరకాండ 68 సర్గలతో నిండి ఉంటుంది. పారాయణ చేసే రోజులనుబట్టి రోజూ చేయాల్సిన సర్గలసంఖ్య ఆధారపడి ఉంటుంది.
2 రోజుల్లో పూర్తి చేయాలనుకునే వారు మొదటి రోజు 36వసర్గ వరకు పూర్తి చేసి, రెండవ రోజు మిగిలిన సర్గలు ముగించాలి.

3 రోజుల్లో అయితే… 1వ రోజు 27వసర్గ, 2వ రోజు 41వ సర్గల వరకు పూర్తిచేసి మూడోరోజు మిగిలిన సర్గలు చదవాలి.

5 రోజులకైతే… 1 వ రోజు 15వ సర్గ, 2వ రోజు 27వసర్గ. 3వ రోజు 38సర్గ, 4వ రోజు 54 సర్గ వరకు మిగిలినవి 5వనాడు పూర్తి చేయాలి.

8 రోజుల పారాయణ చేయాలనుకునే వారు శుక్రవారం నాడు ప్రారంభిస్తే’ మంచిది. రోజూ 9 సర్గల చొప్పున 8వనాడు మిగిలిన 5 సర్గలు చదవాలి.

9రోజుల విధానంలో 1వ రోజు 5సర్గలు, 2వ రోజు 10 సర్గలు, 3వ నాడు ఐదు సర్గలు, 4వ రోజు 6 సర్గలు, 5వ నాడు 7సర్గలు, 6వ రోజు 7 సర్గలు, 7వ రోజు 12 సర్గలు, 8వ నాడు 8 సర్గలు, చివరినాడు మిగిలిన 8 సర్గలను పూర్తి చేయాలి.

సప్తసర్గ పారాయణ సర్వోత్తమమైనది. రోజుకు ఏడు సర్గల చొప్పున పారాయణ చేస్తూ పునరావత్తితో 68 రోజులపాటు చేయాలి. ఈ విధానంలో ఇంకా 10, 12, 14, 28, 41, 48,72, 476 రోజులపాటు కూడా పారాయణ చేయవచ్చు. 476 రోజులు పారాయణ చేస్తే సకల మనోభీష్టాలు నెరవేరతాయని ఉమాసంహిత పేర్కొంది.
పారాయణ విధానాలు

సుందరకాండ పారాయణలో సామాన్య పద్ధతి. సంపుటీకరణ పద్దతి అనే రెండు విధానాలున్నాయి. మొదటి శ్లోకంతో ప్రారంభించి వరుసగా చివరి వరకు చదవడం సామాన్యమైన పద్ధతి. ఎక్కువగా అందరూ ఈ విధానాన్నే అనుసరిస్తారు. తమ తమ కోరికలను అనుసరించి తత్ససంబంధమైన శ్లోకాన్ని ఒక్కో శ్లోకానికి ముందు-వెనకాల జతచేసి పారాయణం చేయడాన్ని సంపుటీకరణ విధానం అంటారు. దీనికి కొద్దిగా సమయం, ఓపిక, నేర్పు అవసరం. అయితే సామాన్య పద్ధతిలో చేసే పారాయణ కన్నా మూడింతల సమయం దీనికి అవసరమవుతుంది. ఫలితం కూడా అదే రీతిలో రెట్టింపు పద్దతిలో సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. త్రిజట స్వప్న వృత్తాంతం గాయత్రీ మంత్ర సంయుక్తం. రామాయణహారానికి. మణిపతకం లాంటిది. పీడకలలు వచ్చినప్పుడు స్వప్నవృత్తాంతం పారాయణ చేసుకోవాలి. వ్యాధులు, కారాగార బంధనాలు, గ్రహపీడలు, దారిద్ర్యం. సంకటాలు మొదలైనవన్నీ సుందరకాండ పారాయణ వల్ల నశిస్తాయి. ఉమాసంహిత, తత్వసంగ్రహం, బ్రహ్మాండ, పారాశర్య ఉపపురాణాలు సుందరకాండ పారాయణకు ప్రత్యేక విధానాలు పేర్కొన్నాయి. మొత్తం కాండనంతా పారాయణం చేయలేని వారు వారివారి అభీష్టానుసారం కేవలం కొన్ని శ్లోకాలు పారాయణ చేస్తే సరిపోతుంది. అలాగే సప్తసర్గ పారాయణ క్రమంలో కూడా

ఎప్పుడెప్పుడు, ఎలా?.

చైత్ర, వైశాఖ, జ్యేష్ట, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక, మార్గశీర్ష, మాఘ, ఫాల్గుణ మాసాలలో పారాయణ చెయ్యడం ఉత్తమం. ఈ చేసినవారికి వరుసగా ధర్మవృద్ధి. సంపద. సర్వార్థసిద్ధి. కర్మవృద్ధి, సామాన్యఫలితం. ధనవృద్ధి, కీర్తివృద్ధి, అధికఫలం. ధార్మిక సంపద
లభిస్తుంది. తిథి వారాల విషయానికివస్తే పాడ్యమి. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథుల్లో పారాయణ చేయవచ్చు. ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాలు విశేషమని పండితులు చెబుతారు. పూజామందిరాలు, తులసికోట, నదీ-సముద్ర తీరాలు, పవిత్ర తీర్థ క్షేత్రాలు, దేవాలయాల్లో పారాయణ చేయడం మంచిది. పరిశుభ్రమైన ఆసనం వేసుకుని ప్రశాంత చిత్తంతో పారాయణ చెయ్యాలి. ఆరంభానికి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. గోత్రనామాలతో సంకల్పం చెప్పుకుని ఏ కోరికతో పారాయణ చేయదలచామో

హనుమత్ ప్రార్థన

సుందరకాండ పారాయణ ఆరంభంలో… చంద్రబింబ సమాకారం నాంఛితార్థ ప్రదాయం

సీతా వియోగబాధతో కృశించి చంద్రునిలా తెల్లగా ప్రకాశించే వాడు. హనుమంతుడితో సేవలు పొందేవాడు. సమస్త కోరికలు తీర్చే వాడైన

శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిస్తున్నాను అని దీని భావం. కాగా పారాయణ ముగించిన తరువాత పఠించాల్సిన శ్లోకమిది.

వాల్మీకి గిరిసంభూతా రామసాగర గామిని
శ్రీమద్రామాయణ గంగాపునాతు భువనత్రయమ్..

శ్లోకసార సమాకీర్ణం సర్గ కల్లోల సంకులం
కాండగ్రహ మహామీనం వందే రామార్ణవం

వాల్మీకి అనే పర్వతం నుండి పుట్టిన రామాయణం అనే మహానది ఈ భూమిని పునీతం చేసి, రాముడనే సముద్రంలో కలిసింది. రాముడనే సముద్రంలో చేపలు, మొసళ్లు, తిమింగలాలుగా శ్లోకాలు, సర్గలు, కాండలు రూపాంతరం చెందాయి. వాటిలో మహామీనం వంటి సుందరకాండకు నమస్కారం.

ఆ కోరికను స్మరించుకోవాలి. కోరికలు లేకుండా పారాయణ చేస్తే ఉత్తమం. హనుమంతునితో ఉన్న సీతారామలక్ష్మణుల చిత్రపటాన్ని ఉంచుకొని యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. నిశ్చలమైన మనస్సుతో పారాయణ ప్రారంభించాలి. పారాయణానంతరం తిరిగి నివేదన. నీరాజనాలు సమర్పించి భక్తితో నమస్కరించాలి. చక్కెర కలిపిన ఆవుపాలను, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు. పారాయణ ఫలాన్ని రామచంద్రస్వామి శ్రీచరణాలకే అర్పించాలి. పారాయణ చేసినన్ని రోజులూ దీక్షా’ నియమాలు పాటించాలి.
ఓంరోగాణాంవినిహంత్రేనమః
శ్లో”తప్తకాంచనసంకాశం నానారత్న విభూషితమ్
| ఉద్యద్బాలార్కదనంత్రినేత్రం కుండలోజ్జ్వలమ్||
రామానుగ్రహముతో మొదలైన సుందరకాండ పారాయణ
సుందరే సుందరో రామః
సుందరే సుందరీ కథ
సుందరే సుందరీ సీత
సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం
సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం
సుందరే కిం న సుందరం?
సేకరణ
మన సమస్యలకు
సుందరకాండ పరిష్కారాలు
సుందరకాండ అద్భుతమైన పారాయణం..!*

ఎన్నో..! సమస్యలకు..! సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి..! ఎంతో మంది పరిష్కారం పొందారు..!

ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం…
సుందరకాండ మొత్తం పారాయణ చేయలేరు..! అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి..!

  1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి:-

*శ్లోకం.: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||

21 దినములు, రోజూ 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.

దుఃఖనివృత్తికి:
*67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా రోజూ 3 సార్లు …
[
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను.
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన.

భూతబాధ నివారణకు:
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను.
1 కొబ్బరికాయ, అరటిపళ్ళు నివేదన.

సర్వ కార్య సిద్దికి:-
64 వ సర్గ నిష్ఠతో రోజూ 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను..!

శత్రు నాశనముకు:-
51 వ సర్గ అతినిష్ఠతో రోజూ 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.

వాహనప్రాప్తికి:-
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు చొప్పున 27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను..!

మనశ్శాంతికి:-
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.

స్వగృహం కోరువారికి:
7వ సర్గ ఏకాగ్రతతో రోజూ 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.

యోగక్షేమాలకు:
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.

ఉద్యోగప్రాప్తికి.:
63 వ సర్గ నిష్ఠతో రోజూ 5 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను..!
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.

రోగ నివారణకు:-
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము,
21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.