నాలుగు నెలల గర్భవతి మాధవి (28)కి అబార్షన్ చేసిన ఓ మహిళ…అబార్షన్ వికటించి ఓ గృహిణి. మృతి……

నాలుగు నెలల గర్భవతి మాధవి (28)కి అబార్షన్ చేసిన ఓ మహిళ…..

అబార్షన్ వికటించి ఓ గృహిణి. మృతి……
(భారత్ న్యూస్ :::గుంతకల్లు)

నేటి సమాజంలో ఆడపిల్ల అంటే అలుసే అన్న తీరులో ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం మూడవ ప్రసవం విషయంలో నాలుగు మాసాల గర్భవతి పాలిట శాపంగా మారి మృతి ఒడిలోకి చేరుకున్న సంఘటన గుంతకల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
పట్టణంలోని కథల వీధిలో నివాసముంటున్న ఓ వృద్ధ మహిళ చేసిన నిర్వాహకమే ఆ అమ్మాయి మృత్యుడికి చేరుకుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లు కర్నూలు జిల్లా డోన్ మరియు కోడుమూరు
పట్టణంలో ఉన్నట్లు విశ్వసినీయ సమాచారం. గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలియజేయడం ఓ నేరమని తెలిసిన స్కానింగ్ సెంటర్ల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనడానికి ఓ ఉదాహరణ వజ్రకరూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న . రాము ,, శ్రీదేవి ల మొదటి సంతానమైన మాధవి మండలం నీ కొన్ని ఏళ్ల క్రితం విడపనకల్లు మండలం చీలుగురికి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకులతో వివాహం జరిగింది ఈ క్రమంలో వారికి ఇరువురు ఆడపిల్లలు సంతానం కాగా మరో సంతానంగా ఆడ శిశువు అనే కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో ప్రైవేట్ స్కాన్ సెంటింగ్ నందుపరీక్షల ద్వారా గుర్తింపు పొందారు సదరు మూడవ సంతానం ఆడ శిశువు అన్న కారణంగా తన మాతృత్వాన్ని విస్మరించి గర్భంలోనే శిశువును తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఓ నివాసంలో ఓ మహిళ నిర్వహిస్తున్న అబార్షన్ల కేంద్రం కు చేరుకున్నారు ఆ నివాస కేంద్రంలో సదరు మహిళ మాధవికు అబార్షన్ చేయుటకు ఉపక్రమించింది ఆమె వైద్యం వికటించి అబార్షన్ లో భాగంగా తీవ్ర రక్తస్రావం జరగడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలంటూ తొందర పెడుతూ చేతులు దులుపుకుంది హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకోగా అక్కడి వైద్య సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవాలంటే ఉచిత సలహాను అందించారు దీంతో సదరు అబార్షన్ గావింపబడిన మహిళను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి కొనఊపిరితో తరలించారు సదరు ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య సదుపాయాలు కల్పించిన 15 నిమిషాల్లోగా మృత్యువాతకు గురయ్యారు. సకాలంలో సదరు యువతిని ఆసుపత్రికి చేరుకుని ఉంటే కొద్దిమేర ప్రాణాపాయం తప్పేదని ,, గత వారం రోజులుగా ఇలాంటి అబార్షన్లతో ముగ్గురు మహిళలు చేరుకున్నారని తమ వైద్యం ద్వారా ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడ్డారని వైద్య సిబ్బంది పేర్కొన్నారు