పవన్ కళ్యాణ్ కు ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉంటాయి.

భారత్ న్యూస్ విశాఖపట్నం..పవన్ కళ్యాణ్ కు ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులు ఉంటాయి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఎల్లప్పుడు దేవుని ఆశీస్సులు ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు అన్నారు.

అవనిగడ్డలోని ఒకటవ వార్డులో గల విక్కుర్తి కార్యాలయం బుధవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని విక్కుర్తి ఆకాంక్షించారు. కూటమి ఐక్యతలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. గతంలో ఎవరూ పట్టించుకోని గిరిజన ప్రాంతాలలోకి వెళ్లి, అక్కడి ప్రజల కోరిక మేరకు రహదారులతో పాటు సౌకర్యాలు కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ అభినందనీయుడన్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని విక్కుర్తి కోరుకున్నారు.