ప్రయాణికులకు గుడ్ న్యూస్ – సింహాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యాధునిక కోచ్‌లు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రయాణికులకు గుడ్ న్యూస్ – సింహాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యాధునిక కోచ్‌లు

రైలు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు దక్షిణ కోస్తా రైల్వే (SCoR) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం ప్రయాణికుల రద్దీతో నడిచే ప్రతిష్టాత్మక సింహాద్రి ఎక్స్‌ప్రెస్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను సాంప్రదాయ ఐసీఎఫ్ (ICF) కోచ్‌ల నుంచి అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ (లింకే హోఫమన్నా Busch) కోచ్‌లుగా మార్చనున్నారు. ఈ ఆధునీకరణ ప్రక్రియ జూన్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ డివిజన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
రైలు నంబర్ 12747 (గుంటూరు – వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్): జూన్ 22, 2026 నుంచి కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది.
రైలు నంబర్ 12748 (వికారాబాద్ – గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్): జూన్ 22, 2026 నుంచి ఆధునిక కోచ్‌లతో సేవలు అందిస్తుంది.
రైలు నంబర్ 17239 (గుంటూరు – విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్): జూన్ 23, 2026 నుంచి సరికొత్త కోచ్‌లతో ప్రయాణికులను చేరవేస్తుంది.
రైలు నంబర్ 17240 (విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్): జూన్ 24, 2026 నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలతో పట్టాలెక్కనుంది.
కొత్త కోచ్‌ల అమరిక పరిశీలిస్తే…. వీటిలో ఒక ఏసీ 3-టైర్ కోచ్, ఒక ఏసీ చైర్ కార్, ఆరు సెకండ్ క్లాస్ చైర్ కార్లు, పది జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒక జనరేటర్ వ్యాన్, మరియు ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/బ్రేక్ వ్యాన్ అందుబాటులో ఉంటాయి.