ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించి 20,000 ఆర్ధిక సాయం అందజేసిన కనపర్తి శ్రీనివాసరావు, తుమ్మల చౌదరి బాబు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించి 20,000 ఆర్ధిక సాయం అందజేసిన కనపర్తి శ్రీనివాసరావు, తుమ్మల చౌదరి బాబు

ఘంటసాల మండల పరిధిలోని తెలుగురావుపాలెం గ్రామానికి చెందిన అగ్నిహోత్రం రాజేష్ అనే ఉపాధి కూలి పనికి వెళ్లి పంట బోదులో పని చేస్తున్న సమయంలో కళ్లు తిరిగి వెనక్కి పడి పోయాడు.

అతని విజయవాడ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు సోమవారం స్థానిక టిడిపి నాయకులతో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రాజేష్ మృతికి గల కారణాలను అడిగి తెలుసుకోవడంతోపాటు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడవద్దు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల చౌదరి బాబు,ఐనపూడి భాను,అరుంబాక రవి,రామపురపు రాహుల్,పెనుమత్స రమేష్,కొల్లూరి అనిల్,మునిపల్లి కాంతారావు,కొండవీటి ఉషా బాబు,పెనుమత్స స్టాలిన్, అరుంబాక పృథ్వీ తదితరులు పాల్గొన్నారు