భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు!
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏటా 3 విడతల్లో రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు 19 విడతల్లో అకౌంట్లో డబ్బులు జమ చేయగా.. ఇప్పుడు 20వ విడత డబ్బులను ఈ నెలలోనే జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత రూ.2 వేలను ఫిబ్రవరిలో జమ చేయగా.. రెండో విడత నగదును ఈ నెల మూడోవారంలో జమ చేయనున్నట్లు సమాచారం.
కిసాన్ నిధి అందాలంటే అర్హులైన రైతులు ఈ-కేవైసీ
చేసుకోవాలి.