మిస్ తెలుగు అమెరికా పోటీలో విజేతగా ఏపీ యువతి

భారత్ న్యూస్ రాజమండ్రి….మిస్ తెలుగు అమెరికా పోటీలో విజేతగా ఏపీ యువతి

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా :

దక్షిణ అమెరికా తెలుగు సొసైటీ ఇటీవల నిర్వహించిన మిస్ తెలుగు అమెరికా పోటీల్లో ఏపీ యువతి విజేతగా నిలిచారు.

కృష్ణా జిల్లా పెడనకు చెందిన భవిరిశెట్టి ఆనందరావు, పావని దంపతుల కుమార్తె నిహారిక న్యూయార్క్ ని లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు.

ఇటీవల నిర్వహించిన మిస్ తెలుగు అమెరికా పోటీల్లో నిహారిక విజేతగా నిలిచారని అభిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు కొల్లూరి సత్యనారాయణ తెలిపారు.