హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

భారత్ న్యూస్ ఢిల్లీ…..హర్మూజ్‌ దిగ్బంధనానికి 10,000 మంది సిబ్బంది

హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఇరాన్‌ పోర్టులను దిగ్బంధించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. 10,000 మంది సిబ్బందితో ఆపరేషన్‌ చేపట్టింది. వీరిలో మెరైనర్లు, సెయిలర్లు, ఎయిర్‌మన్‌లు ఉన్నారు. వీరితో పాటు 12 యుద్ధనౌకలు, పలు యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. గత 24 గంటల్లో అమెరికా దిగ్బంధం నుంచి ఏ నౌక కూడా హర్మూజ్‌ను దాటలేదని సెంట్రల్‌ కమాండ్‌ ఎక్స్‌లో తెలిపింది.