ఏపీలో నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు వేటకు విరామం

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 14 వరకు వేటకు విరామం

చేపల పునరుత్పత్తి కోసం 61 రోజులపాటు అమలు చేయనున్న వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది.

తూర్పు తీర భారత ప్రాదేశిక జలాల్లో జూన్‌ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణ, నిర్వహణకై ఏటా క్రమం తప్పకుండా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

ఈ సమయంలో మోటారు వినియోగించని సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంది

వేట నిషేధం ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు స్వాధీనం, రిజిస్ట్రేషన్‌ రద్దు..

మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందించనున్న ప్రభుత్వం