చల్లపల్లిని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….చల్లపల్లిని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి

ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన చల్లపల్లి మండల ప్రజలు

చల్లపల్లి:
నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో చల్లపల్లిని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని చల్లపల్లి వాసులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నుంచి చల్లపల్లికి భౌగోళికంగా, చారిత్రాత్మకంగా గుర్తింపు ఉందని అన్నారు. దివిసీమకు ముఖ ద్వారంగా ఉన్న చల్లపల్లి ప్రముఖ వ్యాపార కేంద్రంగా, విద్య, వైద్య సేవలు పరంగా ముందంజలో ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలతో చల్లపల్లికి జాతీయస్థాయిలో గుర్తింపు కూడా ఉందన్నారు. జనాభాపరంగా చూసినా.. మౌలిక సదుపాయాల పరంగా చూసినా.. భౌగోళిక పరంగా చూసిన కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గ మండలాలకు చల్లపల్లి కేంద్ర బిందువు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గానికి చల్లపల్లి కేంద్ర బిందువుగా ఉంటే అది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కావున రాజకీయ ఒత్తిడిలకు, ప్రాంతీయ తత్వాలకు తావు లేకుండా అభివృద్ధినే ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని చల్లపల్లిని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అనంతరం సర్వే డిటీ నీలిమకు వినతి పత్రాన్ని అందజేశారు.
వెనిగళ్ళ తారక జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మోపిదేవి ద్వారకానాథ్, మోతుకూరి ఏడుకొండలు, అల్లంశెట్టి వెంకటాచలం (చలం), అబ్దుల్ నజీర్, పరుచూరి బాబు, కోట అంజి, తెనాలి శ్రీను, గుర్రం రాజు, గుర్రం ప్రసాద్, మిరియాల శ్రీనివాసరావు, ఆకుల పాండు, దుట్ట రమణ, ఎర్ర గంగాధరరావు, రెడ్డమ్మ, వక్కలగడ్డ విశ్వేశ్వరరావు, ఎడ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.