భారత్ న్యూస్ శ్రీకాకుళం….పెన్షన్లపై శుభవార్త
AP: జూన్ నుంచి కొత్తగా 5,606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జూన్ 1న 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న సందర్భంగా జూన్ 12న అర్హులైన కొన్ని లక్షల మందికి కొత్తగా పెన్షన్లను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
