భారత్ న్యూస్ శ్రీకాకుళం….గోల్డెన్ సాండ్స్ బీచ్ లో స్పీడ్ బోట్ల సందడి!
బాపట్ల పర్యాటక మ్యాప్‌లో మరో అద్భుత తీరం
బాపట్ల పర్యాటక మ్యాప్‌లో మరో అద్భుత తీరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. బాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని పాండురంగాపురం, కొత్త వాడలేవు గ్రామంలో ఉన్న గోల్డెన్ సాండ్స్ బీచ్ ఇప్పుడు సాహస క్రీడలకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రసిద్ధ సూర్యలంక తీరం తర్వాత అత్యంత అందమైన బీచ్‌గా పేరుగాంచిన ఈ ప్రాంతం, సహజసిద్ధమైన అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
ప్రకృతి ఒడిలో పరవశించే తీరం.. ఆధునిక సౌకర్యాల కలబోత.. వెరసి బాపట్ల సూర్యలంక తీరానికి చేరువలో, పాండురంగాపురం వద్ద రూపుదిద్దుకున్న గోల్డెన్ సాండ్స్ బీచ్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విలాసవంతమైన జీవితానికి సరికొత్త చిరునామాగా మారింది. సాధారణ గృహాలకు భిన్నంగా, రిసార్ట్ తరహా అనుభూతిని,సొంతంచేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం.సముద్రపు హోరు.. మనసుకి హాయి:నగర జీవన ఒత్తిడికి దూరంగా, స్వచ్ఛమైన గాలి, అలల సవ్వడి మధ్య జీవించాలనుకునే వారి కలలను ఈ ప్రాజెక్ట్ నిజం చేస్తోంది. బంగారు వర్ణపు ఇసుక తిన్నెలు, సముద్రపు నీలి అందాల సాక్షిగా నిర్మితమవుతున్న ఈ విల్లాలు,మరియు ప్లాట్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి ఉన్నాయి. ఇక్కడ అడుగుపెడితే ఒక విదేశీ బీచ్ రిసార్ట్‌లో ఉన్నామనే భావన కలుగుతుంది.
ప్రస్తుతం ఈ గోల్డెన్ సాండ్స్ బీచ్ లో స్పీడ్ బోట్లు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. నీటిపై అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ వాహనాలు సాహస ప్రియులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. గంటకు దాదాపు ( 60 నుండి 100 నాటికల్ ) 110 నుండి 185 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బోట్లు, జెట్ ప్రొపల్షన్ సాంకేతికతతో అలలపై అద్భుత విన్యాసాలు చేస్తున్నాయి. ఇది నీటిపై ప్రయాణించే ఒక చిన్న వేగవంతమైన వ్యక్తిగత వాహనం ఇందులో ఒక శక్తివంతమైన ఇంజిన్ ఉంటుంది. ఇది నీటిని లోపలికి లాగి, అధిక ఒత్తిడితో వెనుక నుండి బయటకు వదులుతుంది (జెట్ ప్రొపల్షన్). దీనివల్ల బోట్ ముందుకు వేగంగా దూసుకుపోతుంది
ఒకేసారి ముగ్గురు ప్రయాణించే వీలున్న ఈ బోట్లను మోటార్ సైకిల్ తరహాలోనే సులువుగా నడపవచ్చు. ఇవి చాలా వేగంగా ప్రయాణించగలవు. మోటార్ సైకిల్ లాగా హ్యాండిల్ బార్స్ సహాయంతో దీనిని నడపవచ్చు.ఎక్కువగా పర్యాటక ప్రాంతాల్లో వినోదం కోసం, సాహస క్రీడల కోసం ఉపయోగిస్తారు. ప్రాణ రక్షణ, తీర ప్రాంత గస్తీకోసంకూడా వీటినివాడుతుంటారు.
నీటిలో ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు, మునిగిపోకుండా ఉండటానికి, లైఫ్ జాకెట్ సహాయపడుతుంది. పడవ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ ధరించడం ఇప్పుడు అనేక చోట్ల తప్పనిసరి. పర్యాటకుల భద్రతకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు. ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా నాణ్యమైన లైఫ్ జాకెట్ ధరించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు. సముద్రంలో ప్రయాణించేటప్పుడు బోట్ యొక్క ఖచ్చితమైన స్థానాన్ని, సురక్షితమైన మార్గాన్ని తెలుసుకోవడానికి అత్యాధునిక దిక్సూచి వ్యవస్థలను (నావిగేషన్) వాడుతున్నారు. త్వరలో సూర్యలంక తీరంలో కూడా ఈ బోట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా, ఇప్పటికే వాటి ప్రయోగాత్మక పరిశీలనలు పూర్తయ్యాయి.
అడవి పంచాయతీ పరిధిలోని కొత్త వాడలేవు గ్రామ తీరం, తన పసిడి వర్ణపు ఇసుక తిన్నెలతో పర్యాటకులకు స్వర్గధామంలా కనిపిస్తోంది. సూర్యలంక తీరం తర్వాత అంతే స్థాయి అందాలను కలిగి ఉన్న ఈ గోల్డెన్ సాండ్ బీచ్, స్పీడ్ బోట్ల రాకతో పర్యాటక రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతోంది. సాహసంతో కూడిన వినోదాన్ని కోరుకునే వారికి ఈ తీరం ఇప్పుడు ఒక అద్భుత గమ్యస్థానంగా మారింది.
