భారత్ న్యూస్ విశాఖపట్నం..మరియు గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 ది విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం 67వ వార్డు సాయిరాం నగర్లో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కూర్మమ్మ స్కౌట్స్ మరియు గైడ్స్ స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులుకు ధరిత్రి దినోత్సవం కార్యక్రమంలో భాగంగా డ్రాయింగ్, డిబేట్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. కరెస్పాండెంట్ పాలూరు దేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గైడ్స్ టీచర్ తూర్పాటి సూర్య కుమారి మాట్లాడుతూ పంచభూతాలను మింగేసే వ్యక్తి మనిషి అని ఆవేదన వ్యక్తపరిచారు, విద్యార్థులకు సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు నాయుడు గారు మాట్లాడుతూ మనిషి స్వార్థమే పర్యావరణానికి హానిచేస్తుంది మాట్లాడుతూ మనకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన భూమి మనకన్నా.. మన తల్లి కన్నా.. ఈ భూమి మిన్న తనలో ఎన్నో అనేక విలువైన కనిజాలు మనకోసం దాచి ఉంచింది కానీ ఆధునిక మానవుడు తల్లి లాంటి భూమిని భరించలేని గర్భశోకానికి కి గురి చేస్తున్నాడని,.. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి మాట్లాడుతూ మనిషి స్వార్థానికి నిదర్శనం హిరోషిమా నాగసాకి లాంటి ఘటనలు ఉదాహరణ గా చెప్పడంలో అతిశయోక్తి లేదు భూమి మనల్ని మోస్తూ మన చేష్టలను భరిస్తూ.. తనలో ఉండేవన్నీ మనకు ఇస్తుంది కానీ ఆధునిక మానవుడు చాలదన్నట్లు మనిషి తినే తిండిలో కల్తీ, పీల్చే గాలి కల్తీ, నీరు కల్తీ.. ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే ఫలితము భవిష్యత్ తరాల కే కాకుండా ప్రస్తుతం పిల్లలకు అంగవైకల్యం క్యాన్సర్ లాంటి జబ్బులు భయానక స్థితి కారణం మనమే కావున ప్రతి విద్యార్థి తను మరియు తను కుటుంబ సభ్యులు నిర్వహించే శుభకార్యాల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం అలవాటుగా చేసుకోవాలి. అంతేకాకుండా ప్లాస్టిక్ లాంటి భూతాలను మన దరి చేరకుండా ఉంచినట్లయితే పర్యావరణాన్ని మరియు భూతాపాన్ని కాపాడగలుగుతాము అన్నారు చివరగా అచ్యుతుని సుబ్బలక్ష్మి మరియు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి దేవి గారు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది అని స్కౌట్స్ మరియు గైడ్స్ విశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మరియు జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మణస్వామి తెలిపారు
