రాయలసీమను’రాయల్’ సీమగా మార్చిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ – అంకెం ఇందిరా ప్రియదర్శిని

భారత్ న్యూస్ అనంతపురం..రాయలసీమను’రాయల్’ సీమగా మార్చిన నాయకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ – అంకెం ఇందిరా ప్రియదర్శిని

జి.కొండూరు మండలంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ :

యుధ్ధ విమానాల తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి రావడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది

AMCA లాంటి సుప్రసిద్ధ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం, మెట్ట మెదటిసారిగా 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ మన రాయలసీమకు రావటం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం

లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి మన రాయలసీమకు కూటమి ప్రభుత్వం తీసుకు వస్తుంది

కేంద్ర రక్షణ DRDO, ADA లాంటి మరియు ఇతర సంస్ధలు టాటా, ఎల్ అండ్ టి లాంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యుధ్ధ విమానాల తయారీ విధానంలో భాగస్వామ్యం అయ్యాయి

2028 నాటికి తొలి విమానాన్ని ఎగురవేసే విధంగా ముందుచూపుతో ఉండటం, ముందు ముందు ఇలాంటి చారిత్రాత్మక ఘట్టాలు మనం చూడబోతున్నాం

కూటమి సారధ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి కృషితో మే15 వ తేదీ శుక్రవారం ఈ యూనిట్ కి శంకుస్థాపన జరగబోతుంది

ఈ యూనిట్ తో రాయలసీమ యువతకు వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు, అలాగే ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా రాయలసీమ విరాజిల్లుతోంది

రాయలసీమ బిడ్డ అని చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి గా మిగిలిపోయారు, రాయలసీమను రాయల్ సీమగా మార్చిన ఘనత నారా లోకేష్ గారిది..

యువగళం పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ మాట నిలుపుకోవడానికి పనులను చేతల్లో చేసి చూపిస్తున్న నాయకుడు నారా లోకేష్

రాయలసీమలో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, పట్టించుకోకుండా రాయలసీమను రాళ్ళ సీమగా జగన్ రెడ్డి మార్చితే, రాయలసీమకు అనేక పెట్టుబడులు తీసుకుని వచ్చి రాయలసీమను రాయల్ సీమగా లోకేష్ గారు మార్చారు