11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (june 21)సందర్భంగా భారత ప్రధానమంత్రి గారైన శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అయిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, వారి పిలుపుమేరకు ఈరోజు అనగా 6-6-25 డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ క్రీడా ప్రాంగణం, ఇబ్రహీంపట్నం నందు యోగాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరిగినది. దీనికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ ఐపిఎస్ డైరెక్టర్ జనరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం వారు యోగ అభ్యాసనము ప్రాముఖ్యతను వాటి ప్రయోజనాలను వివరించారు. యోగ వలన ఏకాగ్రత మరియూ శారీరక దృఢత్వం పెరుగుతుందని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని తద్వారా చక్కని ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు సొంతంచేసుకోవచ్చు అని వివరించారు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ 1998 బ్యాచ్ కి చెందిన 248 మంది సిబ్బంది కానిస్టేబుల్స్ గానే విధులు నిర్వహిస్తూ ఉన్నారని దీనిపై తగు అధికారులతో, మరియు గవర్నమెంట్ తో మాట్లాడి ఎన్నో ప్రయత్నాలు ద్వారా ఇప్పుడు మీ అందరికీ ప్రమోషన్ రావడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ కూడా తీర్మానం చేసినట్లు చెప్పారు. ఇంకా కొత్తగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి 167 మంది సిబ్బందితో ఉత్తర్వులు జారీ చేసినట్లు వారందరినీ కూడా అతి త్వరలో విశాఖపట్నంకు పంపిస్తున్నట్లు తెలియజేసారు. ఇంకా గన్నవరంనకు దగ్గరలో ఐదు ఎకరాల గవర్నమెంట్ స్థలము మంజూరు అయినట్లు దానిని ఇప్పుడు చదును చేసే కార్యక్రమము జరుగుతున్నట్టు మరియూ రాష్ట్ర ప్రభుత్వము సహాయంతో ఆ స్థలంలో ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన భవనములు మరియు గ్రౌండ్ తయారు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300 మంది ప్రత్యేక రక్షణ దళ సిబ్బంది మరియు అధికారులతో కలిసి యోగాలో నిర్విరామంగా 50 నిమిషాల పాటు రాష్ట్ర ప్రభుత్వము యోగ ప్రోటోకాల్ ప్రకారము కొనసాగిన సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ బి వెంకట రామిరెడ్డి గారు ఇన్స్పెక్టర్ జనరల్, ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం వారు, డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ అయిన పి శివ రామాంజనేయులు గారు, విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు గారు, అసిస్టెంట్ కమాండెంట్లు అయినా కృష్ణమాచారి గారు, మల్లికార్జున్ రావు గారు, కె శ్రీనివాసులు గారు, టికె రావు మరియు డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ విజిలెన్స్ డిఎస్పి గారు అయిన వెంకటేశ్వరరావు గారు మరియు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఏఎస్ఐలు సిబ్బంది కలిపి 300 మంది పాల్గొన్నారు

ఈ యోగ కార్యక్రమాన్ని శాంతివన్ యోగ ఫౌండేషన్ వారు చాలా చక్కగా నిర్వహించారు, ఈ ఫౌండేషన్ అధినేత అయిన లంకె జనార్ధన్ గారు యోగా గురించిన ఆసనాలు చాలా చక్కగా వివరిస్తూ యస్పీయఫ్ అధికారులు మరియూ సిబ్బంది అందరితో చేయించడం జరిగినది, ఈ ఫౌండేషన్ సంబంధించిన మిగతా సభ్యులు అయిన లంకే లక్ష్మి ,ఏవి సుబ్రహ్మణ్యం ఏ ఈ, ఏ శ్రీనివాసరావు ఏడిఈ, ఎన్ శ్రీనివాసరావు, ఎన్ కృష్ణవేణి, ఉమా, రఘు, భాను ప్రకాష్ ఈ టీం సభ్యులందరూ కలిపి యోగ అభ్యాసనమును ప్రత్యేక రక్షణ దళ అధికారులు సిబ్బంది చేత చేయించి, జయప్రదం చేసినారు.