మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధర

భారత్ న్యూస్ విశాఖపట్నం..Gold Price Today: మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకున్న బంగారం ధర

నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి ధరలతో పోల్చితే సుమారు 400 వరకు ఎగబాకింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర 99,610 రూపాయల వద్ద కొనసాగుతోంది.

అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం లక్ష రూపాయల వరకు వెళ్లింది. ఇప్పుడు తులం బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి లక్ష రూపాయలు దాటుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,130 రూపాయల వద్ద ఉంది.

అదే అదే సమయంలో వెండి కూడా కిలోకు భారీగానే పెరిగింది. నిన్న ఒక్క రోజు రూ.3 వేలకపైగా పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.1,14,100కు చేరుకుంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,310 రూపాయల వద్ద కొనసాగుతుంది.

ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,130 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 99,610 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,130 రూపాయల వద్ద ఉంది.