తెలంగాణలో పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

భారత్ న్యూస్ వరంగల్…తెలంగాణలో పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ

తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

రేషనలైజేషన్ పేరుతో 23వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజన సదుపాయాలు కల్పించాలని, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు కఠినమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

బంద్ నేపథ్యంలో పోలీసులు విద్యాసంస్థల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పలు ప్రైవేట్ స్కూళ్లు ఇప్పటికే సెలవులను ప్రకటించాయి.