ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్లపై సర్కార్ ఆరా!

భారత్ న్యూస్ హైదరాబాద్ …ప్రభుత్వ ఖాతాలు, డిపాజిట్లపై సర్కార్ ఆరా!

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో, వాటిలో ఎంత మేరకు డిపాజిట్లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది.

ఆర్థిక శాఖ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులకు లేఖలు రాసి ఈ వివరాలను సేకరిస్తోంది.

ఇటీవల ఎస్బీఐ భూమిని ప్రభుత్వం వేలం వేయడం, దానిపై బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించడం వంటి పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎస్బీఐ నుంచి ప్రభుత్వ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు ఎస్బీఐ ద్వారా లావాదేవీలు జరుపరాదని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో, కొత్తగా ఎస్బీఐలో డిపాజిట్లు చేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని కూడా అన్ని శాఖలకు సమాచారం పంపారు