పూడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టా శతజయంతి పూజలలో విక్కుర్తి.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….పూడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టా శతజయంతి పూజలలో విక్కుర్తి.

పూడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టా శతజయంతి ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు, VVR ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.

పూడివాడలో శ్రీ మొవ్వ వెంకట దాస స్వామి వారి రాధామాంబ గార్లచే 1926 వ సంవత్సరములో నిర్మించబడిన శ్రీ రుక్మిణి సత్యభామ రాజ్యలక్ష్మి హనుమ ఆల్వారుల ఆచార్య సహిత శ్రీ వేణుగోపాల స్వామివారి 79 వ బ్రహ్మోత్సవములు అత్యంత వైభవోతంగా జరుగుతున్నాయి.

నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంగళవారం శ్రీ వేణుగోపాల స్వామి వార్లను విక్కుర్తి శ్రీనివాస్, జయలక్ష్మి దంపతులు దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోమాలలో విక్కుర్తి పాల్గొని, సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాస్, విక్కుర్తి రాంబాబు లను వేద పండితులు ఘనంగా సత్కరించి, వేద ఆశీర్వచనం అందించారు.