భారత్ న్యూస్ తిరుపతి…కృష్ణాజిల్లా – అవనిగడ్డ
నాగాయలంక మండలం తిప్పాలెం లో కొలువైయున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు చండీ హోమం నిర్వహించారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం తిప్పపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్ణంగా పూర్తవాలంటూ పూజలు నిర్వహించారు
ఈరోజు దేవస్థానంలో స్వామివారికి గణపతి పూజ మండప ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వామివారి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార పళ్ళ రసాలు మొదలగు సుగంధ ద్రవ్యాలతో శ్రీనివాస్ శర్మ వేద పండితుల నడుమ అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు
గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమంలో గణపతి హోమం నవగ్రహాల హోమం లక్ష్మీ హోమం సరస్వతి హోమం ఆఖరికి చండీ హోమం తో కూర్చున్న దంపతులచే పూర్ణాహుతి సమర్పించారు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు చెన్ను లక్ష్మణరావు అన్నపూర్ణయ్య బండ్రెడ్డి ఆదినారాయణ పాపారావు శ్రీ నీల భూ సమేత వెంకటేశ్వర స్వామి ధర్మకర్త గడ్డిపాటి నాగేశ్వరరావు ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

స్వామివారిని సుందరంగా అలంకరించారు వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు.