భారత్ న్యూస్ తిరుపతి…తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
చార్ ధామ్ యాత్రలో కీలక ఘట్టం ప్రారంభమైంది. హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. అటు గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా వేలాది భక్తులు శివయ్య ను దర్శించుకోవడానికి తరలివచ్చారు..
