తస్మాత్ జాగర్త…ఫోర్స్ లోకి వచ్చేసింది …..లాండ్ టైటిలింగ్ యాక్ట్

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,

తస్మాత్ జాగర్త…ఫోర్స్ లోకి వచ్చేసింది …..
లాండ్ టైటిలింగ్ యాక్ట్

మీ ఆస్తి (ఇల్లు, స్థలం, పొలం) జాగర్త…తేడా వస్తే కోర్ట్ కి పొడానికి కూడా హక్కు లేదంట. ఈ చట్టం ప్రకారం మీ ఆస్తికి మీరు అనుభవదారులు మాత్రమే . హక్కుదారి రాష్ట్ర ప్రభుత్వం . ఇప్పటికే ప్రభుత్వ భవనాలు ,ప్రభుత్వ ఆస్తులు అన్ని తాకట్టు పెట్టేశారు. వాటన్నిటినీ తనకా పెట్టేసి , మన నెత్తిన12 లక్షల కోట్లు అప్పు పెట్టేశారు. రేపు అప్పు తేవడానికి ఇక ప్రభుత్వం దగ్గర ఏమీ లేకపోవడంతో ప్రజల ఆస్తిపై పడ్డారు. ఈ హక్కుద్వారా మీ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలియకుండానే తాకట్టుపెట్టి అప్పు తీసుకురావచ్చు. వారు అధికారంలో కొనసాగిటానికి పథకాల పేరుతో జనాలకు చిల్లర వేసి , మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.

ఇప్పటికైనా తెలుసుకోండి. మితిమీరిన సంక్షేమ పథకాలు ఎంత ప్రమాదకరమో!. సంక్షేమ పథకాలు ఇవ్వటం తప్పులేదు. అవి లిమిట్ గా ఉండాలి. అది కూడా రాష్ట్ర సంపాదనను పెంచి, దాంట్లో కొంత భాగాన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలి . అంతేగాని ప్రభుత్వ ఆస్తులు, జనాల ఆస్తులు తాకట్టు పెట్టి కాదు.

పథకాల పేరుతో జనాలకి చిల్లర వేసి , వారిని మత్తులో పడేసి, చాటున రాష్ట్రంలో ఉండె ఖనిజ సంపద మొత్తం లూటీ చేసేస్తున్నారు. ఆ దోచిన డబ్బును వారి ఆస్తులను పెంచుకోవడానికి మరియు ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు .

ఇకనైనా మోసాలు తెలుసుకొని మారండి. లేకపోతే మీ కర్మ .
మీ ఆస్తులు పై మీకు తెలియకుండానే చేయబోయే అప్పులు తీర్చడానికి భవిష్యత్తులో రెడీగా ఉండండి.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిని ఎవరూ కోర్టులలో ఛాలెంజ్ చేయకుండా రాష్ట్రపతి ద్వారా ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు .