–
భారత్ న్యూస్ అనంతపురం .. …Ammiraju Udaya Shankar.sharma News Editor…కాకాణికి బిగ్ షాక్
బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, గిరిజనులను బెదిరించిన కేసుల్లో ముద్దాయిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి
7 వారాలకు పైగా పరారీలో కాకాణి
ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు
తన క్లయింట్ కు ఎలాంటి నేరచరిత్ర లేదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేసిన గోవర్ధన్ రెడ్డి న్యాయవాది
కాకాణి నేరచరిత్రను ఆధారాలతో సహా కోర్టుకు నివేదించిన ప్రభుత్వ న్యాయవాది
ఎన్నికల సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ చూసి ఆయన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తులు
బెయిల్ పిటీషన్ ను వాపస్ తీసుకుంటామని అభ్యర్థించిన కాకాణి న్యాయవాది
కేసు తీవ్రత, 7 వారాలుగా పరారీలో ఉండటం తదితర కారణాల నేపథ్యంలో కాకాణి న్యాయవాది వినతిని తిరస్కరించి బెయిల్ పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు