భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలో ఈ ‘ఓసీ’ కులం పేరు మార్పు పై ….సానుకూలం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో కుల ధృవీకరణ పత్రాల్లో, గ్రామ సచివాలయ ఎంట్రీల్లో ‘ఓసీ వైశ్య’ను ‘ఆర్యవైశ్య’గా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ విన్నవించారు. ఏపీ ప్రభుత్వం విధి, విదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు / కుల గణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను శెట్టి / గుప్త / కోమటి / వేగిన/బుక్క/ జనవశెట్టి లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపారన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో, యాప్‌లలో కూడా ఆర్య, వైశ్యులను వివిధ వర్గాలుగా కనిపిస్తోంది.
అందువలన ఆర్యవైశ్య వర్గాల వారు తికమకపడుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం వారి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఉన్నవారిని.. భవిష్యత్తులో జరగబోయే కుల గణన విషయంలో, యాప్‌లలో, ఆన్ లైన్ సైట్లలో.. ఒకే వర్గంగా అదీ “ఆర్య వైశ్య” అనే విధంగానే ఉండేటట్లు చూడాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండీ రాకేష్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారు.. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని డూండీ రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓసీ వైశ్యను ఆర్య వైశ్యగా మారిస్తే ఎలాంటి గందరగోళం లేకుండా క్లియర్‌గా ఉంటుందంటున్నారు.
